Saturday, December 6, 2025

ఇక గ్యాస్ బాధలు పోయినట్లే.. ఈ పొయ్యితో ఖర్చు తక్కువ..

ప్రస్తుతం కాలంలో ప్రతి ఇంట్లో గ్యాస్ పొయ్యి కచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు కట్టెల పొయ్యి వాడిన వారు సైతం గ్యాస్ స్టౌవ్ కు అలవాటుపడిపోయారు. అయితే గ్యాస్ ధరను చూస్తే చెమటలు పడుతున్నాయి. ఇంచుమించు రూ.1000 లేనిదే గ్యాస్ సిలిండర్ రావడం లేదు. పోనీ కట్టెల పొయ్యి వాడుదామా.. అంటే సిటీల్లో ఉండేవారికి ఇబ్బందులు తప్పవు. కట్టెల పొయ్యి వాడడానికి ఆస్కారం లేదు. కానీ ఇప్పడు కాలం మళ్లీ వెనక్కి వెళ్లినట్లు అవుతోంది. ఎందుకంటే గ్యాస్ పొయ్యిల స్థానంలో మళ్ల కట్టెల పొయ్యిలు వస్తున్నాయి. అయితే ఇవి గతంలో మాదిరిగా కాకుండా కాస్త ఉపయోగకరంగా ఉన్నాయి. అంటే పొగ లేకుండా ఉండే విధంగా కొన్ని కట్టెల పొయ్యిలను మార్కెట్లోకి తీసుకొచ్చారు. మరి దాని గురించి తెలుసుకుందామా..

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతీదీ సౌకర్యంగా మార్చుకుంటున్నారు. ఇప్పుడు కట్టెల పొయ్యిని కూడా స్మార్ట్ గా తయారు చేసి మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే ఒకప్పుడు కట్టెల పొయ్యి అంటే మూడు రాళ్లు.. లేదా ఇటుకలతో ఏర్పాటు చేసుకునేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా కొన్ని పొయ్యిలు మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీటిపై వంట చేయడం ద్వారా పొగ రాకుండా ఉంటుందని వీటిని అమ్మేవారు చెబుతున్నారు. ఈ కట్టెల పొయ్యి ద్వారా పెద్ద పెద్ద వంటకాలు కూడా చేసుకోవచ్చని అంటున్నారు. ప్రస్తుతం శుభకార్యాల్లోనూ గ్యాస్ స్టౌన్ ను వాడుతున్నారు. దీంతో చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈ కట్టెల పొయ్యిని వాడడం ద్వారా చాలా వరకు ఖర్చు తగ్గించుకోవచ్చని అంటున్నారు.

ఈ కట్టెల పొయ్యిని ఎక్కడంటే అక్కడికి తీసుకెళ్లచ్చు. అయితే ఇందులోకి అనుగుణంగా కట్టెలను కట్ చేసుకోవాలి. అంటే పాత పొయ్యిలో మాదిరిగా పెద్ద పెద్ద కట్టెల పెట్టే అవకాశం ఉండదు. చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఇందులో వేయాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి పొగ రాకుండా ఉంటుంది. దీనిని అపార్ట్ మెంట్ లో ఉండేవారు సైతం ఉపయోగించుకోవచ్చ. అయితే ఈ పొయ్యి ఏర్పాటు చేసిన ప్రదేశంలో వెంటిలేషన్ ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈ పొయ్యి కొనుగోలు చేసిన సమయంల ఒక మిషన్ ఇస్తారు. దీంతో స్టార్ట్ చేసిన తరువాత కట్టెలు వేసుకోవడం ద్వారా మండుతూనే ఉంటుంది.

కట్టెల పొయ్యి ద్వారా వండిన వంట చాలా రుచికరంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. పూర్వ కాలంలో కట్టెల పొయ్యిపైన వండిన వంటను తిని ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ పొయ్యిని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు గ్యాస్ ధర విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇది ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. ఇఫ్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్న ఈ పొయ్యిల గురించి ఇంకా ప్రచారం కావాల్సి ఉంది. అయితే కావాల్సిన వారు ఇప్పటికే ఆన్ లైన్ ల ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే దీనిని వాడిన వారు వీడియోలు తీశారు. అందులో ఓ వీడియో మీకోసం..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News