Friday, December 5, 2025

సరస్వతి నది ఎక్కడ ప్రారంభమైంది? ఎందుకు అంతర్వాహిణిగా మారింది?

తెలంగాణలో మే 15 నుంచి 26 వరకు సరస్వతి పుష్కరాలు జరగనున్నాయి. భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం వద్ద ఉన్న త్రివేణి సంగమం వద్ద ఈ పుష్కరాలు నిర్వహించనున్నారు. 12 రోజులపాటు ప్రత్యేక హోమాలు, భారత్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లను చకచగా పూర్తి చేస్తున్నారు. ఇటీవల పుష్కరాలకు సంబంధించిన వెబ్సైటును కూడా ప్రారంభించారు. అలాగే ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వంద పడకల టెంట్ సిటీ ని కూడా ఏర్పాటు చేయనున్నారు. అయితే కాలేశ్వరం వద్ద గోదావరి నది ప్రాణహిత నది మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది. అందువల్ల ఇక్కడ సరస్వతీ పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటారు.. ఇక్కడ మూడు నదులు కలవడం వల్ల త్రివేణి సంగమంగా పేర్కొంటారు. అయితే తెలంగాణలో త్రివేణి సంగమాలు ఎక్కడెక్కడ ఉన్నాయి?

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కు చెందిన ఉపగ్రహ చిత్రాల ద్వారా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి కచ్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు సుమారు 1,600 కిలోమీటర్లు. అయితే మహాభారతం ప్రకారం సరస్వతి నది ఎడారిలో వినాశనా లేదా ఆదర్శన అనే ప్రదేశంలో ఎండిపోయింది. భూమిలోని టెక్టోనిక్ మార్పులు, వాతావరణ మార్పుల కారణంగా ఈ నది ఎండిపోయినట్టు చెప్పబడింది. ఎడారిలో అదృశ్యమైన తర్వాత ఈ నది కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుందని భావిస్తారు. అలాగే సరస్వతీ నది యొక్క పాత నది మార్గం షుగ్గర్ – హక్రా నది వ్యవస్థగా ఉంది. ఇది వాయువ్య భారతదేశం నుంచి ప్రవహిస్తుందని అంటారు.

అయితే గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంను త్రివేణి సంగమంగా భావిస్తారు. గంగా, యమున నది పైకి కనిపించినా.. ఇక్కడ సరస్వతి నది అంతర్వాహిని గానే ప్రవహిస్తుందని చెబుతారు. అలాగే తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో సరస్వతీ నది అంతర్వాహిని నదిగా ప్రవహిస్తుందని భావిస్తారు. ప్రస్తుతం తెలంగాణలోని కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కరాలను నిర్వహిస్తున్నారు. అలాగే బద్రీనాథ్ సమీపంలోని మన అనే గ్రామంలో కూడా సరస్వతి పుష్కరాలు నిర్వహించనున్నారు. సరస్వతీదేవి మన అనే గ్రామంలో నదీ స్నానం చేశారని అందుకే ఇక్కడ ఈ నది పవిత్రమైనదని భావిస్తారు.

Related Articles

2 COMMENTS

  1. Reading this evokes the calm satisfaction of careful observation, noticing small, meaningful details and appreciating the rhythm of thought and reflection.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News