దేశానికి వెన్నెముక రైతు అంటారు. మన దేశంలో ఒక వ్యక్తికి ఆహారం అందుతుందంటే దాని వెనుక రైతు కష్టం ఎంతో ఉంటుంది. అయితే ఎంతో కష్టపడి రైతు పండించిన పంటలను కొన్ని జంతువులు ధ్వంసం చేస్తున్నాయి. ముఖ్యంగా కూరగాయలు పండ్లు పండించే రైతులకు కోతులు, అడవి పందుల చర్యలతో తీవ్రంగా నష్టాలు కలుగుతున్నాయి. అయితే వీటి నుంచి తట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఫలితం ఉండడం లేదు. మరోవైపు కరెంటు తీగలను ఏర్పాటు చేయడం వల్ల మిగతా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో కొందరు రైతులు ఎవరికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా కోతులు, అడవి పందులు రాకుండా పక్కా ప్లాన్ వేశారు అదేంటంటే..?
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా నందికొట్కూర్ మండలం లోని కొన్ని గ్రామాల్లో రైతులు అడవిపందులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక్కడ ఉన్న పగిడ్యాల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు మినుము, కందుల పంటలను వేశారు. ఈ పంటలను పందులు తీవ్రంగా నష్టపోయాయి. దీంతో ఇక్కడి రైతులు బాగా ఆలోచించి ఒక ప్లాన్ వేశారు. సాధారణంగా చిన్న చిన్న సమావేశాల్లో ఉపయోగించే బ్యాటరీ మైకులను పంట పొలాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో క్రూరమైన జంతువుల అరుపులను రికార్డు చేసి పంటలో అక్కడక్కడ ఉంచారు. దీంతో పందులు ఇతర జంతువులు ఇటువైపు రాకుండా ఉన్నాయి. ఫలితంగా రైతుల పంటలు ధ్వంసం కాకుండా ఉంటున్నాయి అయితే ఇలాంటి పరిస్థితి ఏ రైతులు ఎదుర్కొన్న ఇలా బ్యాటరీ మైక్ లను ఏర్పాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు