ఒక్కోసారి అనుకోని ప్రయాణాలు చేస్తుంటాం. మరికొన్నిసార్లు వ్యాపారం కోసం టూర్లకు వెళ్తాం. అయితే సరైన అడ్రస్ తెలియక పోవడంతో రోడ్డు మీద వెళ్లే వారిని అడుగుతాం. కానీ ఇప్పుడు ప్రపంచంలో ఏ దిక్కునైనా తీసుకెళ్లేందుకు Google Map ఉపయోగపడుతుంది. అయితే ఈ గూగుల్ మ్యాప్ వల్ల చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల గూగుల్ మ్యాప్ ఆధారంగా ఒక వంతెన పై వెళ్తూ పూర్తికాని వంతెన నుంచి కిందపడి ఇద్దరు మృతి చెందారు. అప్పటినుంచి గూగుల్ మ్యాప్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు నిపుణులు చెబుతున్నారు. అయితే చాలావరకు ఈ మ్యాప్ ద్వారా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేవారు కూడా ఉన్నారు. గూగుల్ మ్యాప్ ను ఉపయోగించాలంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా కావాలి. కానీ ఇంటర్నెట్ లేకుండా కూడా గూగుల్ మ్యాప్ ను ఉపయోగించవచ్చు. అది ఎలాగంటే..
ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్ ఓపెన్ కాదు. అయితే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా అడ్రస్ తెలుసుకుందామని అనుకున్నా సమీపంలో ఎవరూ కనిపించే అవకాశం ఉండదు. దీంతో ఆ ప్లేసులో మ్యాప్ వచ్చేలా Mobileలో ముందే సెట్ చేసుకోవాలి. ఇందులో భాగంగా మొబైల్ లో ఉన్న ఈ సెట్టింగ్స్ ను చేంజ్ చేయాలి.
Offline లో గూగుల్ మ్యాప్ రావాలంటే..
- ముందుగా మొబైల్ లోని గూగుల్ మ్యాప్ ను ఓపెన్ చేయాలి.
-ఇక్కడ ఎడమవైపు ఉన్న ప్రొఫైల్ పై క్లిక్ చేయాలి. - ఇందులో కొన్ని ఆప్షన్ లు ఉంటాయి.
-వీటిలో Offline మ్యాప్ లో సెలెక్ట్ చేసుకోవాలి. - ఇంటర్నెట్ అందుబాటులో ఉన్న సమయంలో ముందుగా గమ్యానికి చేరుకునే ప్రదేశాన్ని సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఆఫ్ లైన్ గూగుల్ మ్యాప్ డౌన్లోడ్ అవుతుంది.
- దీనిని స్టోర్ చేసుకొని ఇంటర్నెట్ లేని ప్రదేశంలో ఓపెన్ చేయాలి.
- ఇది గమ్యానికి తీసుకెళ్లడానికి చాలా వరకు ఉపయోగపడుతుంది.
దీని ద్వారా గమ్యానికి వెళ్లడం ద్వారా డేటా కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి..