Saturday, February 1, 2025

ముగ్గురు భార్యలు.. ఐదుగురు సంతానం.. ట్రంప్ వ్యక్తిగత జీవితం ఆసక్తికరం..

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. 25 వేల మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్, ఒబామా హాజరయ్యారు. భారత్ నుంచి విదేశాంగ మంత్రి జయశంకర్ హాజరయ్యారు. వీరితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఎలన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ తో పాటు ఇండియా నుంచి రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు హాజరయ్యారు. రాజకీయాల్లో దిట్టా అనిపించిన డోనాల్డ్ ట్రంప్ పర్సనల్ లైఫ్ లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన వ్యక్తిగత జీవితం ఆద్యంతం ఆసక్తికరమని చెప్పారు. ఆ వివరాల్లోకి వెళితే

డోనాల్డ్ ట్రంప్ బంగారు చెంచా నోట్లో పెట్టుకుని పుట్టాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తండ్రి ఫ్రెడో ట్రంప్ న్యూయార్క్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆ తర్వాత దిగ్గజ వ్యాపారవేత్తగా ఎదిగారు. ఈ సమయంలోనే ట్రంప్ 1946 జూన్ 14న జన్మించారు. చిన్నప్పటినుంచి గారాబంగా పెరిగిన ట్రంప్ 1971 నాటికి తండ్రి స్థాపించిన ‘ఎలిజబెత్ ట్రంప్ అండ్ సైన్స్’ సంస్థ పగ్గాలు చేపట్టాడు. ఆ తర్వాత దీనిని ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ గా మార్చుకున్నారు. అక్కడి నుంచి ట్రంప్ లెక్కలేని హోటళ్లు, క్యాసినోవాలు, భారీ టవర్లు, గోల్ఫ్ కోర్టులు నిర్మించారు.

ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ రంగం వైపు వెళ్లిన ట్రంప్ ‘ది అప్రెంటిస్’ అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. 2004- 2015 కాలంలో ఎన్బీసీ ఛానల్ లో ఇది ప్రసారమైంది. ఓవైపు డబ్బు.. మరోవైపు మంచి పేరు తెచ్చుకున్న ట్రంప్ 2000 సంవత్సరంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 2015 జూన్ లో రిపబ్లిక్ పార్టీ లో చేరారు. 2016 ఎన్నికల్లో ఆ పార్ట తరుపున పోటీ చేసి గెలుపొందారు.

డొనాల్డ్ ట్రంప్ నకు ముగ్గురు భార్యలు.. ఐదుగురు సంతానం.. వీరిలో మొదటి భార్య ఇవానా ట్రంప్. ఈమెను 1977లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. వీరు డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఇవాంకా ట్రంప్, ఎరిక్. ఆ తర్వాత ఇవానాకు 1991లో విడాకులు ఇచ్చారు. రెండేళ్ల తరువాత 1993లో మార్ల మాపుల్స్ ను పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక సినిమా హీరోయిన్. వీరికి టిపానీ అనే కుమార్తె ఉంది. వీరు కూడా 199లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రెండేళ్ల ఒంటరిగా ఉన్న ట్రంప్ 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు. ఇమె ఒక ఫ్యాషన్ మోడల్. వీరికి బేరన్ అనే కుమారుడు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News