Wednesday, February 5, 2025

‘డాకు మహారాజ్’ నిజంగానే ఉన్నాడా?

2025 సంక్రాంతి సందర్భంగా పలు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ జనవరి 12న థియేటర్లోకి రాబోతంది. ఈ మూవీ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో హాట్ హాట్ గా చర్చ సాగుతోంది. ఇందులో బాలకృష్ణ డిఫరెంట్ గా కనిపించాడు. అంతేకాకుండా ఇందులోని ‘దబిడ దిబిడే’ సాంగ్ పాపులర్ అయింది. దీంతో ఈ మూవీని చూసేందుకు బాలయ్య ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు సిద్ధం అవుతున్నారు. జనవరి 12న ఆదివారం కూడా తోడు కావడంతో ఈరోజున బాలకృష్ణ మూవీకి క్రౌడ్ ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ సందర్భంగా బాలకృష్ణ సినిమాకు ‘డాకు మహారాజ్’ అనే పేరు ఎందుకు పెట్టారు? ఇంతకీ ఒకప్పుడు నిజంగానే ‘డాకు మహరాజ్’ ఉన్నాడా? అనే సందేహం కలుగుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

బాలయ్య సినిమాలే కాదు.. ఆ సినిమాలకు పేర్లు డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న డాకు మహారాజ్ సినిమాపై చాలా మందికి ఆసక్తి కలిగింది. ఈ పేరు పెట్టడానికి కారణమేంటి?అని. పంజాబ్, మధ్యప్రదేశ్ లోని చంబల్ ప్రాంతాల్లో డాకు మహారాజ్ గురించి కథలుగా చెప్పుకుంటారు. పురాతన కాలంలో డాకు మాన్సింగ్ అనే పేరుతో ఓ వ్యక్తి ఉండేవాడని అమితాబ్ బచ్చన్ ఓ ఇంటర్యూలో చెప్పాడు.

ఇతను ఆగ్రాకు దగ్గర్లోని ఖేరా రాథోడ్ అనే గ్రామంలో జన్మించాడు. ఈయనది క్షత్రియ కుటుంబం కావడంతో ఎక్కువగా చంబల్ ప్రాంతంలో సంచరించేవాడు. 17 మంది సహచరులతో ఓ ముఠాను ఏర్పరుచుకొని అరాచకాలను సృష్టించినట్లు తెలుస్తోంది. అయితే కొందరు మాత్రం అతడిని దేవుడిలా కీర్తిస్తారు. అంతేకాకుండా అతడికి ఖేరా రాథోడ్ అనే గ్రామంలో గుడి కూడా నిర్మించారు. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రాంతంలో డాకు మహారాజ్ అనే వ్యక్తి కూడా ఉన్నారని అంటారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో డాకు మహారాజ్ అనే వ్యక్తి ధనవంతుల వద్ద సొమ్మును దోచేసిన పేదలకు పంచాడట. అలా ఆ పేరు ప్రఖ్యాతి పొందింది. దీనిని ఆధారంగా తీసుకునే బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమా వచ్చిందని అంటున్నారు.

బాలయ్య సినిమాలోనూ ఇదే స్టోరీ ఉంటుందా? అంటే చెప్పలేం. కానీ కొందరు చెబుతున్న ప్రకారం ఈ సినిమాలో ఓ గ్రామం కోసం బాలకృష్ణ పోరాడే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఓ కీలక మలుపు తిరిగి సినిమా ఇంట్రెస్ట్ గా సాగుతుందని చిత్రం యూనిట్ చెబుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మాత్రం డాకు మహారాజ్ గా బాలయ్య ఊచకోత సృష్టించినట్లు తెలుస్తోంది. మరోవైపు పాటలతో ఆకట్టుకునే అవకాశం ఉంది. బాబీ విలన్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇంటర్వెల్ సీన్ చూస్తే దిమ్మదిరుగుతుందని చిత్ర బృందం హింట్ ఇస్తోంది.

ఈ మేరకు డాకు మహారాజ్ పాత్రలో బాలయ్య ఏం చేస్తాడు? ఎలా ఆకట్టుకుంటాడు? అనేది ఆసక్తిగా మారింది. ఏదీ ఏమైనా బాలకృష్ణ సినిమా అంటే ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా ఇతర ప్రేక్షకులకు కూడా ఆసక్తిగా ఉంటుంది. దీంతో జనవరి 12న థియేటర్లన్నీ ‘దబిడదిబిడే’ అని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News