Saturday, December 6, 2025

కవలలు ఉంటే ‘ఆధార్’ అప్డేట్ కష్టమేనా? వీరి విషయంలో ఏం జరిగిందంటే?

భారతదేశంలో గుర్తింపు కోసం ఆధార్ తప్పని సరి. UIDAI ద్వారా పొందే 12 అంకెల నెంబర్ తో ప్రతి ఒక్కరి గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్క పనికి ఆధార్ ప్రామాణికంగా మారింది. ఆధార్ ఉంటేనే ఓటు వేసే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆధార్ నెంబర్ ను కొందరు హ్యాక్ చేయడంతో పాటు ఒకరి పేరు మీద మరొకరు ఆధార్ తీసుకోవడం వంటి సమస్యలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఆధార్ ను అప్డేట్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. ఒక వ్యక్తికి ఉండే పుట్టిన తేదీ, లింగము, ఫేస్ రీడింగ్ మరో వ్యక్తికి ఉండవు. ఒకవేళ పుట్టిన తేదీ లింగము ఒకే రకంగా ఉన్నా రూపాలు ఒక్కటిగా ఉండవు. మరి ఒక వ్యక్తికి ఉండే రూపంతో పాటు పుట్టిన తేది, లింగం మరో వ్యక్తి ఉంటే ఎలా? అలాంటి సమస్యలు మహారాష్ట్రలోని కవలలు ఎదుర్కొంటున్నారు. వీరు ఎన్నిసార్లు ఆధార్ కోసం వెళ్లినా నమోదు కావడం లేదు. అసలేం జరిగిందంటే?

ఎవరైనా కవలలు జన్మిస్తే చాలా మురిసిపోతుంటారు. ఇద్దరు వ్యక్తులు ఒకే రూపంతో ఉన్న వారు తమకు జన్మించడంతో అదృష్టంగా భావిస్తారు. అయితే వీరు ఇప్పుడు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా వాల్వా గ్రామానికి చెందిన తానాజి, సవిత దంపతులకు నీలేష్, యోగేష్ ఇద్దరు కుమారులు. వీరు కవలలు. దేశంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కలిగి ఉండాలని ప్రభుత్వం చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరు ఆధార్ నమోదు కోసం ఎన్ని సార్లు వెళ్లినా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే వీరు ఫేస్ తో పాటు పుట్టిన తేదీ, లింగము ఒకటే కావడం వల్ల ఎర్రర్ చూపిస్తుంది.

వాస్తవానికి వీరికి ఆరేళ్ల వయసులోనే ఆధార్ కార్డులు వచ్చాయి. కానీ ఇప్పుడు అప్డేట్ చేసుకునే క్రమంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా దాదాపు ఎనిమిదేళ్లుగా వీరు ఆధార్ అప్డేట్ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వీరిలో ఒకరు గ్రాడ్యుయేట్ చదువుతుండగా..మరొకరు ఐటీఐ చదువుతున్నారు. అయితే సెర్టిఫికెట్ల కోసం అప్డేట్ చేసిన ఆధార్ తప్పనిసరి. కానీ వీరిని అప్డేట్ కావడం లేదు. దీంతో తీవ్రమనోవేదనకు గురవుతున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు తమకు కవలలు ఉన్నారన్న సంతోషం లేకుండా పోయిందని అంటున్నారు.

ఆధార్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్, సిమ్ కార్డు ఇలా దేనిని పొందలేదు. ఈ నేపథ్యంలో ఈ కవలలు ఎలాంటి సర్టిఫికెట్లు పొందడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటున్నారు. అంతేకాకుండా నీలేశ్ కు ఆధార్ లేకపోవడంతో ఓ ఉద్యోగం కూడా కోల్పోయినట్లు ఓ మీడియా సంస్థకు తెలిపాడు. ఇప్పటి వరకు ఆధార్ లోఉన్న సమస్యలకు పరిష్కారం దొరికింది. కానీ ఇలా ఒకే రూపంతో ఉన్న వారికి ఆధార్ ఎందుకు అప్డేట్ కావడం లేదనేది తేలడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News