Monday, February 3, 2025

ఆ వినాయకుడికి రూ.400 కోట్లతో ఇన్సూరెన్స్.. ఎందుకంటే?

వినాయక చవితి ఉత్సవాలు దేశంలో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఉరూ వాడా, కుల, మతం భేదం లేకుండా అంతా కలిసి చేసుకునే ఈ వేడుకలను 10 రోజుల పాటు నిర్వహిస్తారు. తాటాకుల పందిరి నుంచి ఖరీదైన డెకరేషన్ వరకు భక్తులు తమకున్న స్థాయిలో మండపాలను ఏర్పాటు చేసి భక్తితో కొలుస్తారు. అయితే కొందరు వినాయక మండపాలతో పాటు విగ్రహం ఆకట్టుకునేలా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఇందు కోసం ఎంత ఖర్చుకైనా వెనుకాడడానికి వెనుకాడరు. తాజాగా ఓ గణపతి కోసం రూ. 400 కోట్ల ఇన్సూరెన్స్ చేయించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సాధారణంగా భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియక కొందరు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అలాగే ఇల్లు ప్రమాదంలో పడితే నష్టపోకుండా ఉండడానికి హోమ్ ఇన్సూరెన్స్ చేయిస్తారు. కానీ ఇక్కడ గణపతికి ప్రత్యేకంగా బీమా చేయించారు. అదీ రూ. 400 కోట్లతో. అయితే ఇలా చేయడం ఇక్కడ కొత్తేమీ కాదు. ప్రతీ సంవత్సరం చాలా ఖరీదైన విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఆ తరువాత ఇన్సూరెన్స్ చేయిస్తూ వస్తున్నారు. ఈసారి మాత్రం ఆ గణేశుడికి రూ. 400 కోట్లతో బీమా చేయడం ఆసక్తిగా మారింది. అదెక్కడంటే?

దేశంలో ముంబైలో వినాయక వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. దాదాపు పది రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకల్లో స్థానిక ప్రజలు ప్రత్యేక శ్రద్ధలతో కొలుస్తారు. అలాగే ముంబైలో ఎక్కువ శాతం భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ముంబైలోని జీఎస్ బీ సేవా మండల్ వినాయకుడు ప్రతీ ఏటా ఆకర్షణీయంగా ఉంటున్నాడు. ఇక్కడి వినాయకుడు భారీ సైజులో ఉండడంతో పాటు బంగారం, వెండి ఆభరణాలు ధరిస్తాడు. ఈసారి 66 కిలోల బంగారం, 325 కిలోల వెండి ఆభరణాలను గణేశుడికి అలంకరణగా వేశారు.

అయితే ముందు జాగ్ర్తత్తగా ఇక్కడి నిర్వాహకులు ఈ విగ్రహానికి ఇన్సూరెన్స్ చేయించారు. ఇందుకోసం రూ. 400 కోట్ల 58 లక్షల రూపాయలతో బీమా చేయించినట్లు చెబుతున్నారు. ప్రతీ సంవత్సరం ఇక్కడి వినాయకుడికి ఇన్సూరెన్స్ చేయిస్తూ వస్తున్నారు. గత ఏడాది రూ.360 కోట్ల 40 లక్షతో ఇన్సూరెన్స్ చేయించారు. అంతేకాకుండా ఇక్కడ భక్తులు కానుకలు చెల్లించేందుకు క్యూ ఆర్ కోడ్ తో పాటు డిజిటల్ పేమేంట్ సౌకర్యాలను కల్పించారు. ఇక వినాయకుడి విగ్రహంపై భారీ ఎత్తున్న ఆభరణాలు ఉండడంతో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News