టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటున్నారు. ఆమె ఒకప్పుడు అక్కినేని నాగచైతన్య భార్య అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అక్కినేని నాగచౌతన్య శోభితతో శిశ్చితార్థం చేసుకున్న తరువాత ఆమె గురించి విపరీతంగా చర్చించుకుంటున్నారు. అక్కినేని నాగచైతన్య వివాహ నిశ్చితార్థంపై నేరుగా స్పందించకపోయినా ఇతర విషయాలపై స్పందిస్తున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ లో జరిగిన ఘటనపై ఆమె కన్నీళ్లు పెడుతూ ఓ ఏమోజీని సోషల్ మీడియాలో విడుదల చేశారు. తాజాగా మరో విషయంపై సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే?
మలయాళ ఇండస్ట్రీని హేమ కమిటీ కుదిపేస్తుంది.2017లో ఏర్పాటైన Women In Cinema Collective వినతిమ మేరకు కేరళ ప్రభుత్వం హేమ కమిటీని 2019లో నియమించింది. ఈ కమిటీ కొందరి సినీ ఇండస్ట్రీకి చెందిన వారు హీరోయిన్లకు అవకాశాల పేరిట వేధిస్తున్నారంటూ ఆమె ఇచ్చిన రిపోర్టు సంచలనంగా మారింది. ఈ కమిటీ విషయం బయటకు వచ్చాక ఇతర ఇండస్ట్రీలకు చెందిన వారు స్పందిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రాధిక లాంటి వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఇండస్ట్రీలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని, ఆ విషయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు.
ఇదే సమయంలో సమంత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు ఇండస్ట్రీపై కూడా హేమ కమిటీ మాదిరిగా ఓ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరింది. తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని కోరుతున్నట్లు పేర్కొంది. దీంతో టాలీవుడ్ లోనూ ఇలాంటి ఘటనలు ఉన్నాయా? అని చర్చించుకుంటున్నారు. అయితే హేమ కమిటీపై ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ఒక్కరూ కూడా స్పందించలేదు. కానీ సమంత షాక్ ఇస్తూ ఈ విన్నపం చేయడంపై ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
సమంత రిక్వెస్ట్ పై రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ కాస్త నిరాశతో ఉన్నట్లు సమాచారం. గద్దర్ అవార్డు విషయంలో తెలుగు ఇండస్ట్రీ పట్టించుకోకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇఫ్పుడు సమంత రిక్వెస్ట్ పై స్పందిస్తే మాత్రం టాలీవుడ్ షేక్ అయ్యే అవకాశం ఉంది.