ప్రతీ ఏటా 10 రోజుల పాటు నిర్వహించే గణేశ్ ఉత్సవాలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. 2024 ఏడాదిలో సెప్టెంబర్ 7న వినాయక చవితి ప్రారంభం నుంచి పది రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహిస్తారు. ఈ తరుణంలో తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం గణేష్ మండపాలపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందా? అని అందరూ ఎదురుచూశారు. ఇందులో భాగంగా గణేష్ మండపాల నిర్వహణపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గణేష్ మండపాల నిర్వహణపై కొన్ని సూచలను చేశారు. అయితే ఈసారి గణేష్ మండపాల నిర్వహించేవారికి సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు..అదేంటంటే?
గణేష్ మండపాలు నిర్వహించే వారికి విద్యుత్ తప్పనిసరి. కొందరు ఈ విద్యుత్ కోసం అనుమతి తీసుకోకుండానే వాడుకునేవారు. దీంతో ఎలక్ట్రిసిటీ బోర్డు వారు వచ్చి అభ్యంతరం చెప్పేవారు. ఎలక్ట్రిసిటీ కోసం ఎంతో కొంత డబ్బు చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గణేష్ మండపాలన్నింటికీ ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఉచిత విద్యుత్ పొందాలంటే మాత్రం ముందుగా అనుమతి తీసుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకునే అవసరం ఉందని స్పష్టం చేశారు.
గణేష్ మండపాల నిర్వహణ సమయంలో భక్తులు, అధికారుల మధ్య సమన్వం ఉండాలన్నారు. ఎక్కడ ఉత్సవాలు నిర్వహించాలన్నా ముందుగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే నిమజ్జనానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రశాంతంగా నిమజ్జనం జరగడానికి నిర్వాహకులు సహకరించాలని అన్నారు. అలాగే వీవీఐపీ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు.
హైదరాబాద్ నగరంలో గణేస్ ఉత్సవాల విషయంలో సమన్వయం అవసరం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నగరంలో శోభాయాత్రలోఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని రాచకొండ సీపీకి కీలక ఆదేశాలు జారీ చేశారు. విగ్రహాల ఏర్పాటు నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు ఉత్సవ కమిటీల నిర్వహకులు సహకరించాలని అన్నారు.