తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తునన వారికి తీపి కబురు అందించింది. సెప్టెంబర్ 17 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం మరో ప్రజాపాలన నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ముందుగా అర్హులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డులను అందించేలా మంత్రి ఉత్తకుమార్ రెడ్డి నేతృత్వంలో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి మాత్రమే రేషన్ కార్డులు అందేలా చూస్తుంది. రేషన్ కార్డు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల ఆదాయ పరిమితి ఉండాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. అ మేరకు అర్హులను గుర్తిస్తారు.
మరోవైపు హెల్త్ కార్డులను కూడా జారీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. అయితే ఇంతకాలం రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్య శ్రీ కార్డు అందించారు. కానీ ఇప్పుడు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా హెల్త్ కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం ముందుగా ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు. ఏ కుటుంబంలో ఎలాంటి జబ్బుతో ఉన్న వారు ఉన్నారో గుర్తించి వారికి అనుగుణంగా హెల్త్ కార్డులు అందిస్తారు. అయితే హెల్త్ కార్డులు రేషన్ కార్డుతో లింక్ పెడితే రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని గుర్తించి ఈ ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో రేషన్ కార్డు రావడానికి అర్హత లేకున్నా హెల్త్ కార్డు వచ్చే అవకాశం ఉంటుంది.
https://insightearth.in/ration-cards-for-them-too-telangana-governments-key-decision/
మరోవైపు రేషన్ కార్డుపై వచ్చే జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. అయితే ప్రస్తుతం కంటే సన్నబియ్యం పంపిణీ చేయడం ద్వారా అదనపు భారం పడుతుంది. ఈ నేపథ్యంలో నిజమైన అర్హులను గుర్తించడం ద్వారా కొంత భారం తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. అందుకోసం ముందుగా లబ్ధిదారులను గుర్తిస్తారు. ఈ మేరకు అర్హులను గుర్తించిన తరువాత కొత్త కార్డులు జారీ చేస్తారు.
కొత్త రేషన్ కార్డుల కోసం గత 10 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. కొత్తగా పెళ్లయిన వారు, నిజమైన లబ్ధిదారులకు ఈ నిర్ణయంతో ఊరట కలగనుంది. అయితే రేషన్ కార్డుల్లో తమ పిల్లల పేర్లు చేర్చుకునే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ కొత్త రేషన్ కార్డులు జారీ అయిన తరువాత ఉంటుందా? అంతకుముందే నిర్వహిస్తారా? అనేది తేలాల్సి ఉంది. కాగా కొత్త రేషన్ కార్డుల కోసం గత ప్రజాపాలనలో 10 లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు. ఇప్పుడు నిర్వహించే ప్రజాపాలనలో మళ్లీ దరఖాస్తులు చేయాలా? లేదా ఆ దరఖాస్తుల ఆధారంగా వివరాలు సేకరిస్తారా? అనే సందేహం నెలకొంది. ఈ విషయంలో ప్రభుత్వ ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.