Saturday, December 6, 2025

శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యం ఇదే.. ఎలా తయారు చేయాలంటే?

ప్రతీ ఏడాది శ్రావణ మాసం కృష్ణ పక్షంలో శ్రీకృష్ణాష్టమిని జరుపుకుంటారు. ఈరోజు ఉదయం గోపాలుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే బాల గోపాలుడి అనుగ్రహం పొందేందుకు ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాదు.. ఇష్టమైన ప్రసాదం కూడా నైవేద్యంగా సమర్పించాలని కొందరు అంటుంటారు. అయితే శ్రీకృష్ణుడికి ఎటువంటి ప్రసాదం ఇస్తే ఆయన మనసు వెన్నలా కరుగుతుంది? దానిని ఎలా తయారు చేయాలి?

నందగోపాలుడి ప్రసన్న కోసం అందరూ ఆయనకు పూజలు చేస్తుంటారు. శ్రీకృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందేందుకు ఆస్కారం ఉంటుందని భక్తుల నమ్మకం. ఈ తరుణంలో ఆయన చూపు ఉండేందుకు కన్నయ్యకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలని అంటారు. అయితే శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. వెన్నె కోసం అబాల గోపాలంలో ఇంటింటికి తిరిగేవారు. నెయ్యితో చేసే పదార్థాలు అంటే మరీ ఇష్టంగా తింటారు. అయితే నెయ్యితో పాటు ఈ పదార్థాలను కలిపి ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు.

వీటికి అటుకులు ఒక కప్పు, కొబ్బరి పాలు రెండు కప్పులు తీసుకోవాలి ఆ తరువాత బెల్లాన్ని కొంచెం తురుముకోవాలి. ఇది రెండు కప్పులు ఉంటే సరిపోతుంది. ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. వటితో పాటు చిటికెడు యాలకుల పోడిని దగ్గర ఉంచుకోవాలి.

అటుకులను మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా చూడాలి. ఆ తరువాత కొబ్బరి ముక్కలనుంచి పాలు తీసి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి పాలలో ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని నానబెట్టుకోవాలి. ఆ తరువాత స్టవ్పై పాత్ర ఉంచి బెల్లం వేయాలి. అందులో నీళ్లు పోసి కాస్త పేస్ట్ లాగా చేయాలి. ఆ తరువాత చిన్న మంటపై అటుకులు, కొబ్బరి పాల మిశ్రమాన్ని వేసి ఉడికించాలి. అందులోనే యాలకుల పొడి వేయాలి. ఇది చిన్న హల్వలాగా మారే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వేసి చల్లబరచాలి. ఆ తరువాత ముక్కలుగా కోసం శ్రీకృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News