Saturday, December 6, 2025

ఈ చేపను తింటే విద్యుత్ షాక్.. ఎక్కడ ఉంటుందో తెలుసా?

చేపలు తినడం ఆరోగ్యకరం. మాంసం కంటే చేపల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే కొంత మంది ఎక్కువగా చేపలు మాత్రమే తింటారు. వర్షాకాలం ప్రారంభం తరువాత చేపలు అధికంగా మార్కెట్లో కనిపిస్తాయి. వీటిలో కొర్రమీను, రవ్వ తదితర రకాల చేపల కోసం కొందరు ఎదురుచూస్తారు. అయితే కొన్ని చేపలు ఎక్కువగా విటమిన్లు ఇస్తాయి..మరికొన్ని మాత్రం ఆరోగ్యానికి హానికరం చేస్తాయి. కానీ ఈ చేపలు మాత్రం షాక్ కొడుతాయి. వినడానికి విచిత్రంగా ఉన్న ఇది నిజంగా నిజం.. ఓ చేప శరీరంలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనిని ముట్టుకుంటే మిగతా జంతువులే కాదు.. మనుషులు కూడా చనిపోతారు. ఇప్పటి వరకు చాలా మంది అలా తెలియకుండా ముట్టుకొని చనిపోయారు. మరికొందరు మంచాన పడ్డారు. ఇంతకీ ఆ చేప ఏది? ఆ చేప శరీరంలో ఎంత వరకు విద్యుత్ ప్రవహిస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే..

చెరువులు, కుంటలు, నదుల్లో ఉండే ఈ చేప పేరు Electric Fish లేదా Electric Eel అని అంటారు. ఈ చేపలు అంగ్విలీ ఫార్మస్ జాతికి చెందినవి వీటిని పొలుసుగల పాము చేపలు అనికూడా అంటారు. ఇవి ఎక్కువగా ఆమెజాన్ అడవుల్లోనే ఉంటాయి. వీటిని స్మిత్ సోనియన్ ఇనిస్టిట్యూట్ అండ్ నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరు చేసిన పరిశోధనల ప్రకారం ఈ చేప శరీరంలో 860 వోల్టేజీల విద్యుత్ ప్రవాహం ఉంటుంది. అంటే ఒక మనిషికి ఈ చేపలోని విద్యుత్ ప్రవాహం చేస్తే అతను వెంటనే మూర్చ పడిపోతాడు.

శాస్త్రవేత్తల ప్రకారం ఈ చేప 2.5 మీటర్ల పొడవు ఉంటుంది. దీనికి ఎలక్ట్రోపోర్ వోల్టాయ్ అనే మరొక పేరు ఉంది. ఇటాలియన్ ఫిజిస్ట్ అలెస్సాండ్రో వోల్టా దీనిలో ఉన్న పవర్ ఆధారంగా చేపకు ఆ పేరు పెట్టారు. కొన్ని శతాబ్దాల కింద వరకు ఈ జాతి చేపలు బ్రెజిల్, గయానా, సురేనేమ్ ప్రాంతాల్లో ఉండేవని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే కొందరు ఈ చేపల ద్వారా మనుషులు ప్రాణాలు పోయేంత విద్యుత్ ఉండదని అంటున్నారు. ఇంకొందదు మాత్రం మొసలి వంటి జంతువు ఈ చేపను కొరికి చనిపోయిందని చెబుతున్నారు.

ఇటీవల ఓ మొసలి ఎలక్ట్రిక్ ఈల్ చేపను తినేందుకు ప్రయత్నించింది. కానీ ఎలక్ట్రిక్ ఈల్ లో ప్రవహించిన విద్యుత్కారణంగా మొసలి చనిపోతుంది. అందుకు ఈ చేపలో ప్రవహించిన విద్యుత్ నే కారణమని కొందరు చెబుతున్నారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News