తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం బంఫర్ ఆఫర్ ప్రకటించింది. తాజాగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఏడాదిలో జనవరి నుంచి సన్నబియ్యం, గోధుమలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. రేషన్ షాపుల ద్వారా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చూస్తామని అన్నారు. అలాగే డీలర్ల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుల ద్వారా 3500 ఉత్పత్తులను అందిస్తామని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రేషన్ కార్డులకు ఇక మంచి రోజులు రానున్నాయి. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా బియ్యం, గోధుమలతో సహా మొత్తం నిత్యావసర వస్తువులైన 3500 ఉత్పత్తులను అందించాలని నిర్ణయించారు. ఈమేరకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు మండిపోతున్నాయి. దీంతో రేషన్ లబ్ధిదారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రేషన్ కార్డు ద్వారా తక్కువ ధరకే 3500 ఉత్పత్తులు విక్రయించనున్నారు.
అయితే దీనిపై ఫైలట్ ప్రాజెక్టుగా దేశంలోని 60 రేషన్ షాపులను ఎంపిక చేశారు. ఇందులో తెలంగాణతో పాటు ఉత్తర ప్రదేశ, రాజస్థాన్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా బియ్యం, గోధుమలు, చక్కెరతో పాటు మిగతా వస్తువులు కూడా కొనుగోలు చేయొచ్చు అన్నమాట. ఈ ప్రాజెక్టు ద్వారా రేషన్ లబ్ధిదారులతో పాటు రేషన్ డీలర్లకు ఆదాయం పెరగనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
మరోవైపు తెలంగాణ ప్రభుత్వం జనవరి నుంచి సన్నబియ్యం, గోధుమలు పంపిణి చేస్తామని ప్రకటించింది. దీంతో రేషన్ కార్డు హోల్డర్లకు మంచి రోజులు రానున్నాయి. ఇదిలా ఉండగా త్వరలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా రేషన్ కార్డుల ద్వారా 3500 సరుకులు పంపిణీ చేసినట్లయితే వీటిని పొందేందుకు పోటీ పడే అవకాశం.