తెలంగాణలో రేషన్ కార్డులపై తీవ్రంగా చర్చ సాగుతోంది. ఇటీవల ప్రభత్వం రేషన్ కార్డుల జారీపై కీలకనిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త కార్డులు అందిస్తామని ప్రకటించింది. అయితే అంతకంటే ముందుగా అర్హులను గుర్తించి నిజమైన లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందిస్తామని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లక్షా యాభై వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి మాత్రమే రేషన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో కొందరు అర్హులు ప్రభుత్వం నుంచి ఎప్పుడు మార్గదర్శకాలు వస్తాయా? అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రేషన్ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా తెలంగాణలో ఉన్న వారికే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలో బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడి వచ్చి జీవిస్తున్నారు. వీరు ఎక్కడ ఉపాధి దొరికితే అక్కడ తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవారు కేవైసీ పూర్తి చేయాలని తెలిపింది. ఈ బాధ్యతలను రేషన్ డీలర్లకు అప్పగించింది. దీంతో ఈ కేవైసీ కోసం బారులు తీరుతున్నారు.
అయితే చాలా మంది ఆధార్ కార్డులో తమ అడ్రస్ ఇతర రాష్ట్రాల్లో ఉంటుంది. దీంతో రేషన్ డీలర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక పోర్టల్ ను ఏర్పాటు చేశారు. అయితే రేషన్ డీలర్ల దగ్గర సమస్య పరిష్కారం కాకపోతే తహసీల్దార్ల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారు. అయితే ఈ కైవేసీ పూర్తి అయిన తరువాత కొత్తగా ఉన్న వలస కార్మికులకు కూడా రేషన్ కార్డును అందించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు 10 లక్షల మంది వలస కార్మికులు ఉంటారని అంచనా.
[…] https://insightearth.in/ration-cards-for-them-too-telangana-governments-key-decision/ […]