సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌస్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి గూడెం జిల్లా పూసుగూడెంలో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు చెందిన మొదటి పంప్ ను మంత్రి కోమటిరెడ్డి రెడ్డి వెంకటరెడ్డి ఆన్ చేశారు. రెండో పంప్ ను రేవంత్ రెడ్డి ప్రారంభించగా..మూడో పంప్ ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆన్ చేశారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ప్రారంభం ద్వారా ఇప్పటికే ఉన్న 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు, కొత్తగా 3.29 లక్షల ఎకరాలకు నీరందనుంది. మొత్తంగా 10 లక్షల ఎకరాలకు సాగునీరందించాలనేది ఈ పథకం ఉద్దేశం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన జలయజ్్ంలో భాగంగా ఎత్తిపోతల పతకాలను నిర్మించతలపెట్టారు. ఇందులో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినత తరువాతసీతారామ ప్రాజెక్టుకు 2016లో ఫిబ్రవరి 16న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.7,926 కోట్లు కేటాయించింది. ఆ తరువాత అంచనా వ్యయం పెరిగింది. మొత్తంగా రూ.18 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయం పెరిగింది. అయితే 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.7500 కోట్లు కేటాయించి పనులను పూర్తి చేసింది.
సీతారామ ప్రాజెక్ట్ పంప్ హౌజ్ ద్వారా ఉమ్మడి ఖమ్మ జిల్లా రైతులకు ప్రయోజనం కలగనుంది. ఖమ్మం జిల్లాల 4 లక్షల ఎకరాలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షల ఎకరాలకు, మహబూబాబాద్ జిల్లాలలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం దగ్గర ప్రారంభమైన సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలోని పాలేరు వరకు జలాలు వెళ్లనున్నాయి. ఈ ప్రాజెక్టులో 36.576 టీఎంసీల నీరు నిల్వ ఉండే సామర్థ్యం ఉంది.