మెగా కుటుంబం నుంచి ఎంతో మంది వారసులు సినీ ఇండస్ట్రీలోకి వచ్చారు. వీరిలో కొందరు స్టార్లు అయ్యారు. మరికొందరు రాజకీయ నాయకులయ్యారు. మెగా కుటుంబ నుంచి వచ్చిన రెండో వారసుడిగా నాగబాబును చెప్పుకుంటారు. చిరంజీవి తమ్ముడైన నాగబాబుకు ఒక కొడుకు, కుమార్తె. కుమర్తె నిహారిక గురించి అందరికీ తెలిసింది. ఆచార్య సినిమాల్లో ఆమె కనిపించింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. అయితే నిహారిక నిర్మాణ రంగంలోకి దిగారు. ఆమె ఇటీవల ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 2న రిలీజ్ అయింది. దీనిపై తన అన్న.. మెగా హీరో రామ్ చరన్ స్పందించారు. ఏమని మెసేజ్ చేశారంటే?
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా నిహారిక జోష్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రామ్ చరణ్ ఈ సినిమాపై స్పందిస్తూ ‘నిహారిక.. నువ్వు టీంతో పడిన కష్టానికి మంచి రిజల్ట్ వచ్చింది. నీవు అందరికీ స్పూర్తి దాయకం. ఈ మూవీలో భాగమైన అందరికీ అభినందనలు’ అని అన్నారు. రామ్ చరణ్ తో పాటు పలువురు హీరోలు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా నిహారికకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.