భారతదేశ వారసత్వపు హక్కు చట్టం 2005 లో సవరించబడింది. దీని ప్రకారం ఒక తండ్రి ఆస్తిలో కూతురు కూడా వారసురాలు అవుతుంది. తండ్రికి ఎలాంటి ఆస్తులు ఉన్నా.. వాటిని కొడుకులతో సమానంగా పంచుకోవచ్చు. అంతకుముందు కేవలం కుమారులకు మాత్రమే ఉండగా.. ఆ తరువాత ఈ చట్టాన్ని సవరించారు. అయితే కొత్త చట్టం ప్రకారం తండ్రి తన ఆస్తులను కూతురు పేరిట వీలునామా రాయాల్సి ఉంటుంది. అలా రాస్తేనే కూతరుకు సమానంగా హక్కు ఉంటుంది. ఒక వ్యక్తికి సంబంధించి తన ఆస్తుల విషయంలో ఒక పత్రంపై ఆస్తుల గురించి కూతురుకు రాస్తేనే ఈ పత్రానికి విలువ ఉంటుంది. అయితే తండ్రి ఇలాంటి వీలునామా పత్రం రాసినా.. కొన్ని సందర్బాల్లో ఈ కేసును గెలవలేరు. అవేంటంటే?
- తండ్రి ఆస్తిలో కుమార్తెకు వాటా ఉండాలని 2005 వారసత్వం చట్టం చెబుతుంది. అలాంటప్పుడు కుమార్తె 2005 సంవత్సరానికి ముందే వివాహం జరిగితే తండ్రి ఆస్తిలో కుమార్తెకు వాటా రాదు. అయితే 2005 తరువాత వివాహం జరిగితే.. అప్పటికే తండ్రి కూతురుకు వీలునామా రాస్తే మాత్రమే తండ్రి ఆస్తిలో వాటా కోసం పోరాటం చేయొచ్చు.
- 2005 కు ముందు తండ్రి మరణిస్తే తన ఆస్తిలో వాటా కోసం కూతురు పోరాటం చేయడానికి ఆస్కారం ఉండదు. భారతీయ వారసత్వపు హక్కు చట్టం ప్రకారం సెప్టెంబర్ 9 2005.. ఆ తరువాత జీవించిన వారి నుంచి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది.
- 2005 నుంచి వారసత్వపు హక్కులో కూతురు భాగమైంది. అయితే తండ్రి తన సొంత శాయ శక్తులా సంపాదించుకున్న ఆస్తి.. లేదా తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉన్న ఆస్తి నుంచి వాటా కోరడానికి వీలు లేదు. ఒకవేళ తండ్రి దయా హృదయంతో ఇస్తే లేదా వీలు నామా రాస్తేనే హక్కు పొందగలుగుతారు. అయితే 2005 సవరణ ప్రకారం తాతల ఆస్తిలో నుంచి వాటా కోరవచ్చు.
- తండ్రి తన ఆస్తిని 2005 కు ముందే కుమారులకు పంచి ఇస్తే.. ఆ ఆస్తిని కుమార్తెలు కోరే అవకాశం లేదు. 2005 తరువాత తండ్రి ఆస్తి అలాగే ఉంటే దాని కోసం ఫైల్ చేసుకోవచ్చు.
- తండ్రికి ఎవరైనా గిప్ట్ డీడ్ కింద లేదా బహుమతి కింద వచ్చిన ఆస్తిని కుమార్తెలు కోరే అవకాశం లేదు. ఇది చట్టబద్ధమైనది కానందున కోర్టు పరిధిలోకి రాదు. అయితే యజమాని దీనిని దయా హృదయంతో మాత్రం ఇస్తే తీసుకోవచ్చు.





