డబ్బులు తీసుకోవడానికి Any Time Money (ATM)వాడుతూ ఉంటాం. చేతితో డబ్బుల లేకున్నా వస్తువులు కొనడానికి Credit Card యూజ్ చేస్తాం.. కానీ ఇప్పుడు కొత్తగా రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా ఏటీఎం కార్డును ఉపయోగిస్తున్నారు. చౌకపంపిణీదారుల వ్యవస్థలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు. గతంలో రేషన్ బియ్యం తీసుకోవడానికి ఒక పాస్ బుక్ లాంటిది ఉండేది. దీనిపై కుటుంబ సభ్యుల వివరాలు ఉంటే.. వాటి ప్రకారంగా రేషన్ బియ్యాన్ని అందించారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇలా పంపిణీ చేయడం వల్ల అక్రమాలు జరుగుతున్నాయని గుర్తించి E pass యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కేవలం రేషన్ కార్డు నెంబర్ చెబితే చాలు ఆన్ లైన్ లో వివరాలు వచ్చి వేలి ముద్ర ద్వారా రేషన్ బియ్యం అందిస్తున్నారు. కానీ ఇప్పుడు పౌరసరఫరాల శాక వ్యవస్థ సరికొత్త ప్రయోగం చేసింది.
ATM ద్వారా రేషన్ బియ్యాన్ని తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే ఇది ఒడిశా రాష్ట్రంలో. ఆ ప్రభుత్వం ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ లో ఏటీఎం నుంచి బియ్యం తీసుకునే సదుపాయం కల్పించింది. డబ్బులు పెట్టే మిషన్ లాగానే బియ్యం ఏటీఎం లను ఏర్పాటు చేస్తారు. ఇందులో కార్డు పెట్టి బియ్యాన్ని తీసుకోవచ్చు. అక్కడి ప్రభుత్వం ప్రస్తుతానికి 25 కిలోలు తీసుకునే అవకాశం కల్పించింది. భువనేశ్వర్ లో ప్రారంభించిన ఈ విధానం ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు.
2021 సంవత్సంలోనే ఒడిశా ప్రభుత్వం ఈ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచ ఆహార కార్యక్రమం అనే సంస్థతో ఒప్పందాలు చేసుకుంది. అయితే ఈ విధానం ఏర్పాటు చేయాడానికి ఇప్పడు మార్గం సుగమం అయింది. తాజాగా ఈ ఏటీఎం బియ్యం ప్రాజెక్టును ఆగస్టు 8న ప్రారంభించారు.
అయితే ఈ విధానం తెలంగాణలో ప్రారంభిస్తారా? అనే చర్చ సాగుతోంది. ఒడిశాతో పాటు హర్యానాలోనూ ఈ ప్రాజెక్టులు విజయవంతంగా సాగుతున్నాయి. ఏటీఎంలో మైక్రో చిప్ ను అమరుస్తారు. దీని ద్వారా బియ్యంను తీసుకోవచ్చు. అయితే తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డుల విషయంలో తీవ్ర చర్చలు సాగుతుంది. రేషన్ కార్డులపై ఓ కొలిక్కి వచ్చిన తరువాత ఏటీఎం ద్వారా బియ్యాన్ని తీసుకునే దానిని చర్చించే అవకాశం ఉంది. ఈ విధానం అమల్లోకి వస్తే ఎంతమంది బియ్యం తీసుకుంటున్నారు? ఎంతమంది వదులుకుంటున్నారు? అనే విషయం అర్థమైపోతుంది. దీంతో ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గనుంది. మరోవైపు అక్రమాలు జరకుండా ఈ విధానం ఉపయోగపడే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.