Friday, January 30, 2026

బతుకమ్మ చీరలకు పులిస్టాప్.. వాటి స్థానంలో ఈ బహుమతులు..!

తెలంగాణలో ప్రతీ ఏటా నిర్వహించే బతుకమ్మ పండుగ సందర్భంగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. బతుకమ్మ ఆడపడుచుల పండుగ అయినందున వారికి కానుక ఇవ్వాలనే ఉద్దేశంతో రేషన్ కార్డుపై ఉచితంగా చీరలను అందించారు. అయితే ఈ చీరలు నాణ్యత లేవని కొందరు అప్పట్లోనే ఆందోళనలు చేశారు. వారికి మద్దతుగా వివిధ పార్టీల నాయకులు మద్దతు పలికారు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ చేస్తుందా? లేదా? అనే సందేహం ఉండేది.కానీ ప్రభుత్వం మాత్రం చీరల పంపిణీ వల్ల ఏ మహిళకు మేలు జరగదని భావించింది. నాణ్యత లేని చీరలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని తేల్చింది. కానీ చీరలకు బదులుగా మహిళలకు కానుకలు ఇవ్వాలని అనుకుంటోంది. అదేంటంటే?

తెలంగాణలో బుతుకమ్మ చాలా పెద్ద పండుగ. ఈ పండుగను వారం రోజుల పాటు మహిళలు ఉత్సాహంగా జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ వస్తుందంటే మహిళల్లో ఎక్కడా లేని ఉత్సాహం ఉంటుంది. ఈసారి బతుకమ్మ పండుగకు చీరలు కాకుండా ఇతర కానుకలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ చీరల స్థానంలో పిండివంటలకు సంబంధించిన వస్తువులు ఇవ్వాలా? అని కసరత్తు చేస్తున్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రత్యేకంగా పిండి వంటలు తయారు చేసుకుంటారు. వీటి తయారీలో మహిళలు బిజీ అవుతారు. అయితే ఇటీవల కాలంలో వీటి తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. దీంతో మహిళలకు వీటి తయారీకి అయ్యే ఖర్ఛును నగదు రూపంలో ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చీరలు పంపిణీ చేసినప్పటికీ కొందరు మహిళలు చీరలు నాణ్యత లేవని ఆందోళన నిర్వహించారు. చీరలకు బదులు పిండి వంటలు చేసుకునేందుకు సాయం చేయాలని కొందరు అభిప్రాయ పడ్డారు. అలాగే తమకు డబ్బు ఇస్తే మంచి చీరలు కొనుక్కుంటామని కొందరు అన్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యంతో పాటు 9 రకాల వస్తువులను అందించారు. వీటిలో కందిపప్పు, చింతపండు తదితర వస్తువులు ఉన్నాయి. అయితే బతుకమ్మ పండుగ సందర్భంగా పిండివంటలకు అవసరమ్యే సరుకులను అందిస్తే ఎలా ఉంటుంది? అనే విషయంపై కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తంగా ఏదో రకంగా మహిళలకు కానుకను అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అవుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News