Wednesday, January 28, 2026

ఇక రెజ్లింగ్ కు గుడ్ బై..: వినేశ్ పొగాట్ సంచలన నిర్ణయం

పారిస్ ఒలంపిక్స్ లో ఫైనల్ వరకు చేరి అనర్హత సాధించిన వినేశ్ పొగాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఇక రెజ్లింగ్ పోటీలకు దూరం అని తేల్చారు. ఇక నుంచి రెజ్లింగ్ పోటీలో ఉండనని తెలిపారు. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత్ తరుపున ఫైనల్ కు అర్హత సాధించడంలో వినేశ్ పొగాట్ రికార్డు సృష్టించారు. మరో రోజు గడిస్తే ఈ విభాగంలో స్వర్ణం అందే అవకాశం ఉండేది. కానీ దురదృష్టవ శాత్తూ ఆమె అధిక బరువు ఉండడం వల్ల ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. ఒలంపిక్స్ నిబంధనల ప్రకారం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమెపై అనర్హత వేటు పడింది. దీంతో ఆమె కుప్పకూలిపోయింది.

వినేశ్ పొగాట్ పై అనర్హత వేటు పడిన క్రమంలో భారతదేశ వ్యాప్తంగా ఆమెకు మద్దతు నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం వినేశ్ పొగాట్ ఇప్పటికే విజయం సాధించారన్నారు. నిన్న జరిగిన పార్లమెంట్ లో సైతం కేంద్ర క్రీడా శాఖ మంత్రి స్పందించారు. వినేశ్ పొగాట్ కు కేంద్ర అండగా ఉంటుందని అన్నారు. అయితే 50 కేజీల కేటగిరి ఈవెంట్ కు ఆమె బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మంగళవారం రాత్రి మొత్తం వర్కౌట్ చేస్తూ ఆహారం తీసుకోలేదు. అయినా కూడా 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో ఆమె అర్హత కోల్పోయారు.

ఈ తరుణంలో ఎంతో తీవ్ర మనోవేదన చెందిన వినేశ్ పొగాట్ బాధాకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తాను రెజ్లింగ్ క్రీడలకు దూరం అని చెప్పారు. ఈసందర్భంగా ఓ మెసేజ్ పెట్టారు. ‘ నేను ఓడిపోయాను.. రెజ్లింగ్ నాపై గెలిచింది. ఇక నాకు బలం లేదు. రెజ్లింగ్ కు ఇక గుడ్ బై’ అని ఎమోషనల్ అవుతూ తన ఎక్స్ ఖాతాలో మెసేజ్ పెట్టారు. దీంతో క్రీడాభిమానులు ఆమెను ఓదారుస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News