ఆషాఢ మాసం తరువాత వచ్చేది శ్రావణమాసం. శ్రావణ మాసంలో శుభకార్యాల జోరు ఉండనుంది. పండుగలు, పెళ్లిళ్లకు ఈ మాసం అనువైనది. శ్రావణ మాసంలో పెళ్లిళ్ల తో పాటు శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు, ఇతర శుభ కార్యాలు నిర్వహించుకోవడానికి రెడీ అవుతారు. 2024 సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్టు 5 నుంచి ప్రారంభం అవుతోంది. అయితే శ్రావణ మాసంలో కొన్ని రోజుల మాత్రమే శుభముహుర్తాలు ఉన్నాయి. అవి ఏవీ?
శ్రావణ మాసంతోనే పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. వరలక్ష్మీ వత్రం, నాగుల పంచమిన, రాఖీ పండుగ ఈనెలలోనే వస్తాయి. ఆ తరువాత వినాయక చవితి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సారి శ్రావణ మాసంలో కొన్ని శుభముహుర్తాలు ఉన్నట్లు కొందరు పండితులు తెలిపారు. వీటిలో ఆగస్టు 8, 9,10, 11, 15, 17, 18, 22,23,24, 28,30 తేదీల్లో శుభ కార్యాలు నిర్వహించుకోవచ్చని తెలుపుతున్నారు. శ్రావణ మాసంలో ఈ రోజుల్లో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి రెడీ అవుతున్నారు.
శుభ ముహూర్తాల తేదీ గురించి తెలిసిన వాళ్లు పెళ్లిళ్లు జరుపుకునే వారు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫంక్షన్ హాళ్లు బుక్ చేసుకుంటున్నారు. అర్చకులకు అడ్వాన్స్ లు ఇస్తున్నారు. దుస్తులు, ఇతర సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఆషాఢంలోనే ఆఫర్లు ఉండడంతో ఇప్పటికే దుస్తులు కొనుగోలు చేశారు. శ్రావణంలోనూ పండుగల సీజన్ కారణంగా ఆఫర్లు ప్రకటించనున్నారు.