కొన్ని రోజులుగా గరిష్ట స్థాయిలో పెరుగుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఇండియాలో మాత్రం భారీ స్థాయిలో తగ్గాయి. అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. బులియన్ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు న్యూ ఢిల్లీలీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.67,600 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డ్ 73,730 వద్ద ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ప్రస్తుతం రూ.73,580 ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 67,450 గా కొనసాగుతోంది. 10 రోజుల పాటు పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. నిన్నటి కంటే ఈరోజు వెండి రూ.200 పెరిగింది. దీంతో ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రూ.95 వేల వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్ కిలో వెండి రూ.95,500 గా ఉంది. జీఎస్టీ, తదితర కారణాలతో హైదరాబాద్ లో ఎక్కువగా కొనసాగుతోంది. ఓ వైపు బంగారం ధరలు తగ్గుతున్నా వెండి ధరలు తగ్గడం లేదు.అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2364 డాలర్ల వద్ద కొనసాగుతోంది. సిల్వర్ ఔన్స్ కు 31 డాలర్లుగా ఉంది.