ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ సారి బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈమేరకు గన్నవరంలోని కేసరపల్లిలో ఏర్పాట్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు. అలాగే తమిళ నాడు నుంచి రజనీకాంత్, సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి తదితరులు హాజరు కానున్నారు. కేబినెట్ లో మొత్తం 24 మంత్రులు ఉండనున్నారు. వీరిలో ముగ్గురు మహిళలకు చోటు దక్కింది. వారి వివరాల్లోకి వెళితే..
వంగలపూడి అనిత:
వంగలపూడి అనిత విశాఖపట్నం జిల్లా ఎస్. రాయవరం మండలం, లింగరాజు పాలెంలో జన్మించారు. ఈమె 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరుపున పాయకరావు పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి చెంగల వెంకటరావుపై 2,828 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమితులయ్యారు.
2019లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2021 జనవరి 30 నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలిగి కొనసాగుతున్నారు 2024లో జరిగిన ఎన్నికల్లో పాయకరావు పేట నుంచి పోటీ చేసిన అనిత 1,20,042 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
గుమ్మడి సంధ్యారాణి:
విజయనగరం జిల్లాకు చెందిన గుమ్మడి సంధ్యారాణి మొదటి సారి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సాలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సమీప టీడీపీ అభ్యర్తి రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్ చేతిలో 14,970 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.
2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాజన్న దొరపై ఓడిపోయారు. 2014లో అరకు లోక్ సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2015 నుంచి పార్టీ శాసనమండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2020లో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమితులయ్యారు.
ఎస్.సవిత:
సత్యసాయి సాయి జిల్లా పెనుకొండ మండలం వజ్రాలపేటకు చెందిన వనిత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీకి చెందిన ఉష శ్రీ చరణ్ పై గెలుపొందారు. సవిత తండ్రి ఎస్ రామచంద్రా రెడ్డి టీడీపీలో మంత్రిగా పనిచేశారు.