ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించి Ap EAPCET 2024 ఫలితాను మంగళవారం సాయంత్రం 4 గంటలకు విడుదల అయ్యాయి. వీటిని EAPCET చైర్మన్ ప్రసాదరాజు, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యా మండలి ఇన్ చార్జి రామ్మోహన్ రావులు కలిసి సంయుక్తగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇంజనీరింగ్ విభాగం నుంచి 1,95,092 (75 శాతం) మంది విద్యార్థులు అర్హత సాధించారు. వ్యవసాయ, ఫార్మసీ పరీక్షలో 70, 352 (87.11 శాతం) మంది క్వాలిఫై అయ్యారు.
ఏపీలో EAPCET ను మే 16 నుంచి 23 వరకు నిర్వహించారు. ఇందులో ఇంజనీరింగ్ విభాగం నుంచి 2,58,373 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వ్యవసాయ, ఫార్మసీకి చెందిన 80,766 మంది పరీక్షరాశారు. మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,39, 139 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. EAPCET ఫలితాల్లో వచ్చిన మార్కులకు ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్కులు 25 శాతం వెయిటేజీ కలుపుతారు. రెండింటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తారు.
EAPCET ఫలితాల కోసం అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.inలో చెక్ చేసుకోవచ్చు.