టీ 20 వరల్డ్ కప్ 2024లో భాగంగా జూన్ 9న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ సాగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల జట్లు మాత్రమే కాకుండా వివిధ దేశాల క్రీడాభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరో కొద్ది గంటల్లోనే ఈ మ్యాచ్ ప్రారంభం కానుండడంతో దీనిపై విపరీతమైన చర్చలు సాగుతుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ జట్టుపై ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హాట్ కామెంట్ చేసింది. ఈ కామెంట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
వరల్డ్ క్రికెట్ లో ఈసారే అడుగుపెట్టిన అమెరికా సీనియర్ జట్టు పాకిస్తాన్ జట్టుపై గెలిచింది. జూన్ 6న జరిగిన ఈ మ్యాచ్ లో అమెరికా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ తరువాత అమెరికా 20 ఓవర్లలో 3 వికెట్ల కు 159 రన్స్ చేసింది. దీంతో అమెరికా ఆటగాళ్లు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో ఈ మ్యాచ్ పై ట్రోలింగ్స్ మొదలయ్యాయి.
ఈ తరుణంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ ‘జొమాటో’ సంచలన కామెంట్స్ చేసింది. ‘Pakistan bro aisi perfomance hogi to tumhi batado sunday ko ad slots le yana’అని తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. అంటే ఇదే పనితీరును ఆదివారం కూడా కొనసాగిస్తారా? అంటూ కామెంట్ చేసింది. భారత్, పాకిస్తాన్ మధ్య జూన్ 9న హై వోల్టేజ్ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నందున ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.
pakistan bro aisi performance hogi to tumhi batado sunday ko ad slots le ya na#PakvsUSA
— zomato (@zomato) June 6, 2024





