విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 69, 169 మెజారిటీతో గెలుపొందారు. దాదాపు పదేళ్లుగా రాజకీయంలో కొనసాగుతున్న ఆయన మొత్తానికి గమ్యానికి చేరుకున్నారు.ఎన్నో అవమానాలు, చీదరింపులు, సాహసాలు చేసిన పవన్ చివరికి తాను గెలవడంతో పాటు తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకున్నాడు. పవన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు ఎంతో శ్రమకోర్చి ఆయన విజయం వైపు గా పనిచేశారు. పిఠాపురంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కు 70,354 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపి కూటమి తరుపున ప్రచారం చేసిన ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు. ఆ తరువాత 2018 లో జనసేన పార్టీ స్థాపించి 2019లో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారు. అయితే ఈ సమయంలో ఆయన గాజువాక సీటు మాత్రమే గెలుచుకున్నారు. ఆ తరువాత ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేసిన ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ కూటమితో కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి రాజకీయాల్లో వచ్చి మొదటి సారిగా ఎమ్మెల్యే కావడంపై శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని ఫలితాల కోసం లైవ్ బ్లాగ్..
ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్స్… – insightearth.in – Telugu News Portal