సాధారణంగా నీటిలో మొసలి(Crocodile)ని చూస్తే ఒక్కసారిగా భయమేస్తుంది. కానీ అది దగ్గరికి వస్తే.. ఇంకేమన్నా ఉందా.. ఆ క్షణం మనం ఈ లోకంలో ఉన్నామా? అని అనిపిస్తుంది. కానీ ఓ యువతి తన చెల్లెలని కాపాడుకోవడం కోసం మొసలితో పోరాడింది. ఎంతో ధైర్య సాహసాలు చేసి మొసలి తలపై మరీ కొట్టి దాని బారి నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా.. ఆమె ధైర్య సాహసాలు మెచ్చి బ్రిటన్ ప్రభుత్వం ఆమెకు కింగ్స్ గ్యాలంట్రీ మెడల్ ప్రకటించారు.
బ్రిటన్ లోని శాండ్ హస్ట్ కు చెందిన జార్జీ లోరీ, మెలిస్సాలు కవలలు. వీరు ఎంతో సరదాగా ఉంటారు. ఉంటారు. 2021 జూన్ లో వీరిద్దరు కలిసి మెక్సికోలోని ఓ నదిలోకి స్విమ్మింగ్ కోసం వెళ్లారు. ఈ క్రమంలో ఒక మొసలి మెలిస్సాపై దాడికి దిగింది. దీంతో జార్జియా తన చెల్లెల కోసం ప్రాణాన్ని పణంగా పెట్టింది. అత్యంత ధైర్య సాహసాలతో మొసలి మొఖంపై కొట్టి దాని నుంచి తన చెల్లి మెలిస్సాను కాపాడుకుంది. ఆ తరువాత వీరు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

అయితే మొసలి చేసిన దాడిలో అక్కా చెల్లెళ్లకు గాయాలయ్యాయి. మెలిస్సా మణికట్టు ప్రాక్చర్ అయింది. పొత్తి కడుపుపై మొసలి గాట్లు పడ్డాయి. అటు జార్జియా చేతిని మొసలి కొరికింది. ఇది జరిగి మూడేళ్లు అవుతున్నా.. ఆ భయంకర క్షణాలు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయని ఇటీవల వారు టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలం గడుస్తున్నా.. ఆ సంగతి ఇప్పటికీ మరిచిపోలేము అని అన్నారు. ఇది నిజంగా జరిగిందా? అని ఒక్కోసారి అనిపిస్తుంది. అని చెబుతున్నారు.

శాండ్ హస్ట్ లోని బెర్క్ షైర్ కు చెందిన వీరు స్విమ్మింగ్ లో ప్రావీణ్యం ఉన్నవారు. 2024 ఆగస్టు 11న థేమ్స్ మారథాన్ పోటీల్లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇలా పలు పోటీల్లో పాల్గొనగా వచ్చిన డబ్బును కమ్యూనిటీలకు సహాయం చేస్తారు. హెన్లీ ఆన్ థేమ్స్, మార్లో ద్వారా రూ.4 లక్షలు సేకరించాలనేది వీరి లక్ష్యం అని ఓ ఇంటర్యూలో చెప్పారు.





