సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లిన వారు ఎందరో ఉన్నారు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన కంగనా రానౌత్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో కొన్ని ప్రత్యేక వ్యాఖ్యలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఆమె బీజేపీలోకి చేరారు. ప్రస్తుతం జరిగే లోక్ సభ ఎన్నికల్లో కంగనా రానౌత్ పోటీ చేస్తున్నారు. హిమాచల్ రాష్ట్రంలోని మండి నియోజకవర్గం నుంచి ఇటీవల నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కంగనా రానౌత్ తన ఆస్తుల చిట్టాను బయటపెట్టారు.
కంగనా రానౌత్ తన నామినేషన్ వేసిన సందర్భంగా ఆస్తుల వివరాలు ప్రకటించారు. ఆమె తెలిపిన ప్రకారం మొత్తం ఆస్తుల విలువ రూ. 287 కోట్లు. వీటిలో 62.9 స్థిరాస్తులు, 90 కోట్లకు పైగా ప్రాపర్టీ ఉందని తెలిపారు. రూ. 3.91 కోట్ల విలువైన మూడు లగ్జరీ కార్లు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె వద్ద ఉన్న 2 లక్షల నగదు ఉన్నట్లుత తెలిపారు. రూ. 1.35 కోట్లు తన బ్యాంకులో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే రూ.5 కోట్ల విలువైన 6.7 కిలోల బంగారం,60 కేజీల వెండి, రూ. 3.4 కోట్ల విలువైన డైమండ్ ఆభరణాలు ఉన్నాయని తన నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు.
కంగనా రానౌత్ ఆస్తులతో పాటు తనపై 8 క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలిపారు. లోక్ సభ 2024 ఎన్నికల్లో భాగంగా ఇప్పటి వరకు 4 విడతలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏడో విడతలో భాగంగా జూన్ 1వ తేదీన మండి నియోజకవర్గంలో ఎన్నికలు జరగనున్నాయి. ఆమెకు పోటీగా కాంగ్రెస్ నుంచి విక్రమాధిత్య పోటీ చేస్తున్నారు.