Tuesday, June 24, 2025

బెడ్ రూంలోకి 9 అడుగుల పాము.. ఏం చేశారంటే? వీడియో వైరల్

సాధారణంగా ఎక్కడైనా పాము కనిపిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ఒళ్లు వణుకుతుంది. కానీ అదే పాము ఏకంగా బెడ్ రూంలో ఉంటే ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. కానీ ఓ బెడ్ రూంలోకి 9 అడుగుల నాగుపామును గుర్తించారు. ఇది చూసిన ఆ కటుంబ సభ్యులు అటవీ అధికారులకు సమాచారం అందించగా దానిని సేఫ్ గా అడవిలో వదిలారు. ఈ వివరాల్లోకి వెళితే…

కర్ణాటకలోని అగుంబేకు చెందిన ఫిల్మ్ డైరెక్టర్ అజయ్ గిరి తన ఇస్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోనూ పోస్టు చేశారు. తన బెడ్ రూంలో అకస్మాత్తుగా 9 అడుగుల పాము ఉన్నట్లు గుర్తించగా వెంటనే షాక్ కు గురయ్యారు. దీంతో అయన అటవీ అదికారులకు సమాచారం అందించాడు. ఆ తరువాత అటవీ అధికారులు రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ స్టేషన్ సభ్యులు అక్కడికి వచ్చారు. తమ దగ్గరున్న ఓ స్టిక్ తో పామును మెల్లగా ఒక సంచిలోకి వెశారు. ఆ తరువాత దానిని సురక్షితంగా అడవిలోకి వదిలారు. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

బెడ్ రూంలో లో సడెన్లీగా 9 అడుగుల పాము కనిపించే సరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయిందని అజయ్ గిరి తన వీడియో సందర్భంగా మెసేజ్ పెట్టారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నందు ఈ పాము తప్పిపోయి బెడ్ రూం వరకు వచ్చిందని చర్చించుకుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో పాములను గుర్తిస్తే ఆందోళన చెందకుండా అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News