Wednesday, June 25, 2025

చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేసి 30 ఏళ్లు..

ఎన్నో సవాళ్లు.. కుళ్లు.. కుతంత్రాలు.. ఆందోళనలు.. నిరసనలు… వేధింపులు.. ఇవన్నీ తట్టుకోవడం అంటే ఒక వ్యక్తికి సాధ్యం కాని పని. కానీ రాజకీయ రంగంలో ఉన్న వారిలోకొందరు వీటిని ఛేదించగలుగుతారు. అలాంటి వారు పొలిటికల్ లీడర్ గా రాణిస్తారు. శతాబ్దాల చరిత్రలో రాజకీయ చరిత్ర చూస్తే కొందరు మాత్రమే ఈ రంగలో రాణించారు.. అతి కొద్ది మాత్రమే జగజ్జేతగా నిలిచారు. అటువంటి వారిలో నారా చంద్రబాబు నాయడు ఒకరు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు అంటే ఒక విజన్.. ఒక శక్తి.. యువతరానికి ఆదర్శంగా ఉండే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం గురించి ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే?

తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘ కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నారా చంద్రబాబు నాయకుడు రికార్డు సృష్టించారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో 9 సంవత్సరాలు.. విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఆరు సంవత్సరాలు(ప్రస్తుతం ముఖ్యమంత్రి)గా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఆర్థిక నిపుణుడిగా పేరున్న బాబుకు అడ్మినిస్ట్రేటిపైనే కాకుండా రాజకీయ పాలనపై మంచి పట్టు సాధించారు. అందుకే సుదీర్ఘ కాలంలో ప్రజా క్షేత్రంలో కొనసాగుతున్నారు.

1975లో కాంగ్రెస్ లో యువజన అధ్యక్షుడిగా ప్రారంభించిన తన రాజకీయ జీవితం.. ఆ తరువాత 1978లో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత మలుపు తిరిగింది. అప్పటి నుంచి తిరుగులేని విజయాలు సాధిస్తూ.. పలుసార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తరువాత 1995 సెప్టెంబర్ 1న తొసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి 2004 వరకు 9 సంవత్సరాల పాటు కొనసాగారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి.. విభజిత ఆంధ్రప్రదేశ్ లో 2014లో మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024లో మరోసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ ప్రజా పాలనలో భాగం అవుతున్న చంద్రబాబు నాయకుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 30 సంవత్సరాలు గడుస్తోంది. ఈ సందర్భంగా ఆయనకు పలువరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News