వానకాలం పంట సాగుకు రెడీ అవుతున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలపింది. పీఎం కిసాన్ 17వ నిధుల జారీకి తేదీని ఖరారు చేసింది. జూన్ 18న రైతుల ఖాతాల్లో రూ.2వేల చొప్పున జమ కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత నియోజకవర్గంలోని వారణాసిన నుంచి ఈ నిధులను విడుదల చేయనున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తొలి సంతకం పీఎం కిసాన్ నిధులపైనే చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జూన్ 18 నుంచి ఈ నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. కాగా ఇప్పటి వరకు రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3.04 లక్షల కోట్లు అందించినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం పీఎం కిసాన్ పథకం కింద 9.3 కోట్ల మందికి రూ.20 వేల కోట్లు చెల్లించనున్నారు.
పీఎం కిసాన్ కు సంబంధించి ఇప్పటికే చాలా మందికి సమస్యలు ఉన్నాయి. అయితే వెంటనే కేవైసీని అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే కేవైసీ అప్డేట్ చేసిన వాళ్లు తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి www.pmkisan.gov.inఅనే వెబ్ సైట్ లోకి వెళి అందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ప్రత్యేకంగా ఓపెన్ అయ్యే పేజీలో ఆధార్ లేదా అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలసి అప్పుడు గెట్ డేటా అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ వివరాలు కనిపిస్తాయి.